• Login / Register
  • NATIONAL | Girl Suicide | దేశ రాజధాని ఢిల్లీలో బాలిక‌ ఆత్మ‌హ‌త్య‌

    NATIONAL | Girl Suicide | దేశ రాజధాని ఢిల్లీ ఆత్మ‌హ‌త్య‌
    కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు
    HYDERABAD | ఢిల్లీలోని జామియా నగర్‌ (Jamia Nagar)లో నివాసం ఉండే 17 ఏళ్ల బాలిక జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలు రాసింది. అయితే, అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక తాను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనకు ముందు జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు తల్లిదండ్రులను క్షమాపణలు కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాలిక బిల్డింగ్‌పై నుంచి దూకి కిందపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
    * * *

    Leave A Comment